Rightclickdisab

తెలుగు వార్తా పత్రికలూ :- సాక్షీ, ఈనాడు ENQUARY PNR STATUS * పాటకులకు మా విజ్ఞప్తి! వీలువైన సమచారాన్ని మీ ద్వారా మా సైట్ లో పొందుపరచ తలచాము. దయచేసి మీకుతేలిసిన విషాయలను,సమస్యలను మాతో SHARE చేసుకోగలరు. మీ వీలువైన సమాచారాన్ని మాకు ఈ - మేయిల్ ద్వార కానీ కామెంట్ ద్వార కానీ తెలియచెయగలరు. మీ ద్వారా అందిన సమాచారాన్ని PUBLIC POOL అనే లింకులో పొందుపరుస్తాం గమనించగలరు.*

భగినీ హస్త భోజనం...

భగినీ హస్త భోజనం...

‘భగిని’ అంటే...చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు. ‘హస్తభోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట. ఇందులో కొత్త విషయం ఏముందని మీరు అడగచ్చు. సాధారణంగా వివాహమైన చెల్లలు, అక్క  ఇంటిలో తల్లిదండ్రులుగానీ., అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల ఋణం ఉంచుకోవడం పుట్టింటివారికి ఇష్గం ఉండదు. శుభసందర్భాలలో., శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు కానీ., ఊరికే వచ్చి తిననడం మర్యాద కాదని మన సాంప్రదాయం. కానీ., కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం  వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించితీరాలని శాస్త్రం నిర్ణయించింది.  దీనికి ఓ కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటంటే....


సూర్యభగవానునకు  సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. ‘యమునకు’ అన్నయ్య ‘యముడు’ అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా ‘యమీ’ అని  పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునుకు మాట ఇచ్చాడు. అ రోజు తన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు  పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని, మన్నించమని, ‘కార్తీక శుధ్ద విదియ’ నాడు తప్పకుండా విందుకు వప్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు. యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.

అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘ ప్రతి యేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకు రావాలనీ., అలాగే ప్రతి పోదరుడు ఈ రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ’ వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని యమునకు అనుగ్రహించాడు. అందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్రం నియమం విధించింది. ఆ నియమం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది.

*మహారాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా-దుజ్’ అని పిలుస్తారు.

*నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను ‘భాయి-టికా’ అని పిలుస్తారు.

 *పంజాబ్ ప్రాతంలో ఈ పండుగను ‘టిక్కా’ అని పిలుస్తారు.

No comments:

REMEMBER

MESSAGE OF THE DAY:

LOVE ALL SERVE ALL

REMEMBER EVER :-

HELP EVER HURT NEVER
TIME WASTE IS LIFE WASTE

HI FRIENDS....

HI FRIENDS....
U LIKE MY BLOG

Caution

Please Click To "Older Posts" You Can See The Next Page

under maintenance

This Blog Some Features Is Present Under Development keep watching it [ For Best View This Blog Browse in Google Chrome or Fire Fox ]